preloader

Temple History

volunteer

మందిర విశిష్టత

40 సంవత్సరములకు పూర్వము కొంత మంది రైల్వే ఉద్యోగులును కలుపుకొని కీ॥శే॥ రామ్మోహనరావు గారు సాయి సత్సంగ మండలి స్థాపించి బాబా భజనలు, సత్సంగములు నిర్వహిస్తూ ఉందెడివారు. శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాష్టారు గారి అడుగుజాడలలో సాయి తత్త్వ ప్రచారమును నిర్వహిస్తూ ఉండెడివారు. వారు సంస్థకు మొదట గౌరవాధ్యక్షులుగా వ్యవహరించివారు. ఇప్పుడున్న ప్రదేశములో బాబా పటమును ఉంచి, చిన్న తాటి ఆకు పందిరి వేసి సాయి కార్యక్రమములను రైల్వే కాలనీ నుండి ఇచ్చటకు మార్చినారు. ఆనాడు షిర్ది సాయి మహత్యము సినిమా సందర్భముగా, థియేటరులో ఏర్పాటు చేసిన ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ శ్రీ సాయి విగ్రహము శ్రీ ఎస్‌.బి.శంకర రావు గారి సహాయముతో తీసుకుని వచ్చి తాటి ఆకు పందిరిలో ఉంచి అర్బనలు , హారతులు ఇచ్చుట మొదలు పెట్టినారు. మార్చ్‌ 10 వ తేది 1988 వ సం॥ము ఇప్పుడున్న చిన్నబాబా వారి విగ్రహం లలితా దేవి ఉపాసకులు కీ॥ శే॥ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు తయారు చేయబడిన యంత్రముతో ప్రతిష్ట జరిగినది. నాడు కీ॥శే॥ ఎక్కిరాల భరద్వాజ మాష్టారు గారు సిద్ధి పొందిన పిదప కమిటీ సభ్యుల కోరిక మేరకు ప్రముఖ న్యాయవాది శ్రీ పి.గౌతమ్‌ రెడ్డి గారు గౌరవాధ్యక్షులుగా భాద్యతలు స్వీకరించినారు. నాటి నుండి నేటి వరకు మందిర అభ్యున్నతి ఆకాంక్షిస్తూ అనేక మంది అవధూతలను, యతీశ్వరులను ఆహ్వానించుట జరిగినది.



జగద్రక్షకులు, ప్రత్యేక సాక్షీభూతులు సూర్యనారాయణ భగవానుడు ప్రతినిత్యం ప్రాతఃకాల సమయమునందు శ్రీ సాయి భగవానుని పాద పద్మాలను తన లేత కిరణాలతో స్పృశించి లోకోద్ధారణ గావించుచున్నాడు

ధ్యాన మందిరములో ఉన్న ద్వారకామాయి వటమును షిర్దిలో సాయి తత్వముతో జీవించిన శివనేశన్‌ స్వామి వారు ఇచ్చినారు. ఈ మందిరములో చిన్నబాబావారు, పెద్దబాబా వారు ఉన్నారు. పెద్దబాబా వారిని శ్రీ వెంకయ్య స్వామి వారి శిష్యులు, శ్రీ గురవయ్య స్వామి ది 09-07-1998వ తేదిన ప్రతిష్టించినారు. అత్యున్నతమైన వదవులు నిర్వహిస్తున్న వ్యక్తులు అనేక మంది మందిరమునకు విచ్చేసి సాయిబాబా వారిని దర్శించి తరించినారు. గౌరవాధ్యక్షులు (శ్రీ పి.గౌతమ్‌ రెడ్డి గారి సూచనల మేరకు పలుమార్లు వైద్య శిబిరములు, ఉచిత మందుల పంపిణి, బీదలకు దుప్పట్ల పంపిణి, ప్రభుత్వ ఆసువత్రి నందు పండు, రొట్టెలు వంపిణి, ప్రకృతి వైపరీత్యములు సంభవించినప్పుడు ఆర్థిక, వస్తు నహాయము, బీద విద్యార్థులకు ఆర్థిక నవాయము, మందిరములో ప్రతి గురు, ఆది వారములలో ఉచితముగా హోమియో వైద్యము, మందుల వంవిణి నిర్వహించబడుచున్నవి.

గత 2 వువ్మరాలలో 50,000 మందికి అన్నదానము చేయుట జరిగినది.

వరమహంన పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్‌ స్వామి సువర్ణ వాన్తముల మీదుగా ది.15-01-2015 నిత్యాన్నదానము ప్రారంభించబడి దిగ్విజయముగా జరుగుచున్నది. 

బాబా వారు సమాధి చెంది 100 సం॥లు పూర్తయిన సందర్భముగా 27-07-2018 గురువూర్ణిమ మహోత్సవములు అత్యంత వైభవముగా జరిగినవి. మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి.గౌతమ్‌ రెడ్డి గారు మరియు పాలకవర్గ నభ్యులు నంకల్పించిన 1,00,000 కొబ్బరి బోండాలతో బాబా వారికి విశేష అభిషేకము జరిగినది. ఈ కార్యక్రమమునకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి న్వయముగా అభిషేకము చేసినారు. 40,000 మందికి పైగా భక్తులకు అన్నవ్రసాద వితరణకు జరిగినది. పలువురు యతీశ్వరులు విచ్చేసి బాబాకు అభిషేకము చేసి భక్తులకు మంగళ శాననములు అందజేసినారు. ఈ విశేష కార్యక్రమమునకు అధికారులు, అనాధికారులు, వ్రజావ్రతినిధులు, టి.వి, సినీ రంగ కళాకారులు పాల్గొనినారు.

01-01-2021 న బాబా వారికి విశేషముగా 10,000 పంచెలతో దశ నహస్ర వస్త్ర పూజా కార్యక్రమము నిర్వహించుట జరిగినది. విచ్చేసిన ప్రతి భక్తునికి అన్నప్రసాదము అందించడం జరిగినది. 

01-01-2022 న బాబా వారికి విశేషముగా లక్ష కేజీల బియ్యముతో తండులాభిషేకము నిర్వహించుట జరిగినది. వేలాది మంది భక్తులు న్వయముగా బాబా వారికి విశేషముగా 1,00,000 కేజీల బియ్యముతో తండులాభిషేకము చేసినారు. నుమారు 25,000 మందికి పైగా భక్తులు అన్నవ్రసాదమును స్వీకరించడమైనది.

'పై కార్యక్రమములు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికిర్డ్‌) వారు గుర్తించి మెడలు, నర్జిఫికేట్స్‌ అవార్డు అందజేసినారు.